ఒకప్పుడు తెలుగులో కామెడీ షోస్ ని తలదన్నేలా ఈటివి నుంచి మల్లెమాల ప్రొడక్షన్ వారు జబర్దస్త్ కామెడీ షో ని డిజైన్ చేసారు. వేణు, శ్రీను, ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు ఈ షో తో పాపులర్ అవడమే కాదు అదే షో ని తమ కామెడీతో టాప్ లో ఉండేలా చేసారు. ఆతర్వాత సుధీర్, ఆది, శ్రీను, చంటి, రాఘవ వాళ్ళు టీమ్ లీడర్స్ గా ఆ కామెడీని కంటిన్యూ చేసారు.
కొన్నేళ్ల పాటు జబర్దస్త్ కి ఎదురు లేకపోయినా తర్వాత పలు ఛానల్స్ ఇలాంటి షోస్ స్టార్ట్ చెయ్యడము, జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకోవడంతో జబర్దస్త్ షో పూర్వ వైభవం కోల్పోయింది. ఎంతమంది టీమ్ లీడర్స్ మారినా ఆది, చంద్ర, వేణు, ధనరాజ్ ను రీప్లేస్ చేయలేకపోయారు. ప్రస్తుతం నామ్ కే వాస్త్ అన్నట్టుగా జబర్దస్త్ షో తయారైంది.
నాగబాబు, రోజా లాంటి జెడ్జిలు లేకపోవడం, అనసూయ యాంకరింగ్ నుంచి తప్పుకోవడం, కామెడీ కరువవ్వడం, ప్రస్తుతం ఉన్న టీమ్ లీడర్స్ వెకిలి కామెడీ తో షో పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక ఇప్పుడు కొనసాగుతున్న రామ్ ప్రసాద్, చంటి, ధనరాజ్ లు జబర్దస్త్ టీమ్ లీడర్స్ గా తప్పుకుంటున్నట్టుగా తాజా ప్రోమోలో చూపించారు.
కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని, తమలా వారిని కూడా ప్రోత్సహిచాలంటూ, అందుకే తాము తప్పుకుంటున్నామని ఆరుగురు టీం లీడర్స్ చెప్పిన ప్రోమో హైలెట్ అయ్యింది. మరి నిజంగానే వారు జబర్దస్త్ వదిలేస్తారా, లేదంటే ప్రాంక్ చేస్తున్నారా అనేది పూర్తి ఎపిసోడ్ లో తెలియాల్సి ఉంది.




వావ్ అనిపిస్తున్న జాన్వీ కపూర్ లేటెస్ట్ షూట్

Loading..