మేనేజ్ చేసేవాళ్లను మేనేజర్లు అంటారు! మేనేజర్లు లేని రంగం ఏదీ? అన్ని రంగాల్లోను మేనేజర్లు ఎక్కువే. అలాంటిది ఒక స్టార్ హీరోకి ఏకంగా ఏడుగురు మేనేజర్లు ఉన్నారు. ఈ మేనేజర్లు అనే కంచెను దాటుకుని దేవుడు కూడా అతడి దరికి చేరలేడు.
అయితే ఒక సాధారణ డైరెక్టర్ ఆ హీరో దగ్గరకు చేరుకోగలడా? పాపం అలాంటి పరిస్థితే దాపురించింది బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కి. అతడు సదరు స్టార్ హీరోతో నేరుగా కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ దానికి మేనేజర్లు ససేమిరా అన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు మేనేజర్లు ఉన్నారు. స్టార్ హీరో చుట్టూ కంచె వేసారు. పైగా మా హీరోకి ఇలాంటి మెసేజ్ లు పెట్టడానికి ఎంత ధైర్యం? అంటూ ఆ డైరెక్టర్ ని నిలదీసారు. బాగా తిట్టారు. దీంతో వెర్రెత్తిపోయిన అతడు సెట్ నుంచి వెళ్లిపోయాడు. ఆ సినిమా నుంచి వైదొలిగానని తెలిపాడు.
అంతేకాదు ఆ హీరో చుట్టూ ఉన్న కోటరి చివరికి సదరు హీరోని ఫ్లాపుల బాటలోకి వెళ్లేలా చేసారని కూడా వెల్లడించాడు. అయితే ఆ స్టార్ హీరో ఎవరో పేరు చెప్పేందుకు నిరాకరించాడు. అంత పెద్ద హీరో పేరు చెబితే ఈగో గొడవలు పెరుగుతాయని భయపడ్డాడు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ ను వదిలేసి సౌత్ లో సెటిలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫిలింమేకింగ్ పైనా, క్రియేటివిటీపైనా అతడు నిరంతరం ఏదో ఒక సందర్భంలో విరుచుకుపడుతూనే ఉన్నారు. అక్కడ అందరూ కృత్రిమంగా కథలు తయారు చేస్తారని విమర్శిస్తున్నాడు.




పర్పుల్ డ్రెస్ లో సమంత కొత్త లుక్ 

Loading..