టాలీవుడ్ యువహీరో అల్లు శిరీష్ తన స్నేహితురాలు నయనిక రెడ్డిని వివాహమాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. అల్లు - మెగా కుటుంబాల నుంచి ప్రముఖులతో పాటు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా నిశ్చితార్థ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, వరుణ్ తేజ్ - లావణ్య దంపతులు హైలైట్ గా కనిపించారు.
అయితే ఈ వేడుక అనంతరం పార్టీ నుంచి కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా శిరీష్ స్వయంగా ఒక వీడియోని షేర్ చేసి తనలో ఉన్న జాయ్ గురించి మాట్లాడాడు. తన మనసును హత్తుకున్న ఒక అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో క్లిప్ ని మీ కోసం షేర్ చేస్తున్నానని శిరీష్ వెల్లడించారు. ఈ వీడియోలో శిరీష్ గురించి కాబోయే భార్య నయనిక రెడ్డి మాట్లాడుతూ... ``తనను చూసినప్పుడు ఒక చిన్న బేబిలా అనిపించాడు.
అతడిలో ప్రేమ ఎఫెక్షన్ నన్ను ఆకట్టుకున్నాయి.. అతడిలో ఈ లక్షణాలను ప్రేమిస్తున్నాను!`` అంటూ నయనిక ఆనందంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ యూనిక్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఈ జంటను చూసిన తర్వాత `మేడ్ ఫర్ ఈచ్ అదర్` అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శిరీష్ -నయనిక పెళ్లి వెన్యూ, తేదీ వగైరా వివరాలు తెలియాల్సి ఉంది.




రాజా సాబ్ - మారుతిపై ఒత్తిడి

Loading..