పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ద రాజా సాబ్. ఈ చిత్రం మొదలవ్వకముందు దర్శకుడు మారుతి ని ట్రోల్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ రాజా సాబ్ నుంచి వచ్చిన అప్ డేట్స్ వారిని సంతృప్తినిచ్చాయి. ఆతర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నమ్మకమే పెట్టుకున్నారు. ఇక డిసెంబర్ 5 నుంచి రాజా సాబ్ జనవరి 9 కి వెళ్లిన ఎలాంటి గోల చెయ్యలేదు.
అయితే రాజా సాబ్ ట్రైలర్ ని అక్టోబర్ 2 నే వదిలేసి.. ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా చెయ్యడంతో సోషల్ మీడియాలో రాజా సాబ్ ప్రమోషన్స్ ఇంకెప్పుడు అంటూ మాట్లాడుకోవడమే కాకుండా, మరొక్కసారి రాజా సాబ్ రిలీజ్ వాయిదా ఏమైనా వేస్తారేమో అనే న్యూస్ లు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంత టెన్షన్ పెడుతున్నాయో తెలియదు.
కానీ దర్శకుడు మారుతి పై మాత్రం ఒత్తిడి మొదలైంది అనే చెప్పాలి. ఇంకా సినిమా విడుదలకు రెండు నెలలే ఉంది, ఇప్పటికి రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రాకపోవడం, అసలు షూటింగ్ ఫినిష్ అయ్యిందో, లేదో క్లారిటీ లేకపోవడం పై సోషల్ మీడియాలో నడుస్తున్న ముచ్చటతో మారుతి పై ఒత్తిడి మొదలై ఉండొచ్చని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.




జాతీయ అవార్డుల జూరీపై ప్రకాష్ రాజ్ అసహనం

Loading..