Advertisementt

ఖాన్‌ల త్ర‌యానికి ష‌ష్ఠిపూర్తి.. ఇక ప్ర‌భాస్ ఒక్క‌డే

Mon 03rd Nov 2025 08:52 AM
prabhas  ఖాన్‌ల త్ర‌యానికి ష‌ష్ఠిపూర్తి.. ఇక ప్ర‌భాస్ ఒక్క‌డే
Khans Feeling danger with Prabhas Raise ఖాన్‌ల త్ర‌యానికి ష‌ష్ఠిపూర్తి.. ఇక ప్ర‌భాస్ ఒక్క‌డే
Advertisement
Ads by CJ

భార‌త‌దేశంలో బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్స్ ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే.. ఒక‌ప్పుడు ఖాన్ ల త్ర‌యం అని చెప్పుకునేవారు. కానీ ఇటీవ‌లి కాలంలో సీన్ అంతా మారిపోయింది. టాలీవుడ్ నుంచి ప‌లువురు గేమ్ ఛేంజ‌ర్స్ పాన్ ఇండియాలో దూసుకెళుతున్నారు. ప్ర‌భాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ వంటి స్టార్లు పాన్ ఇండియా రేస్ లో ఉన్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా ఈ రేసులో చేర‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో ఖాన్‌లు ముగ్గురూ ష‌ష్ఠి పూర్తి వేడుక‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. అమీర్ ఖాన్ ఇటీవ‌లే ష‌ష్ఠిపూర్తి వేడుక‌లు జ‌రుపుకున్నాడు. ఈ వేడుక‌ల్లో మూడో భార్య గౌరి స్ప్రాట్ ని ప‌రిచ‌యం చేసాడు. ఆ త‌ర్వాత ఈరోజు (02 న‌వంబ‌ర్) షారూఖ్ ఖాన్ కూడా ష‌ష్ఠిపూర్తి వేడుక‌లు జ‌రుపుకున్నాడు. దీనికోసం ఏర్పాటు చేసిన పార్టీలో ప‌లువురు తార‌లు డ్యాన్సుల‌తో అత‌డి మెప్పు పొంద‌డానికి ప్ర‌య‌త్నించారు. షారూఖ్ న‌టించిన `కింగ్` టీజ‌ర్ ని కూడా విడుద‌ల చేసి ఇంకా ఖాన్ ఏజ్ 40 మాత్ర‌మే అనేంత‌గా క‌ల‌ర్ ఇచ్చారు.

ఖాన్ ల త్ర‌యంలో మ‌రో సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ వ‌చ్చే ఏడాది ష‌ష్ఠి పూర్తికి రెడీ అవుతున్నాడు. అంటే ఆ ముగ్గురు ఖాన్‌లు వృద్ధులు అయిపోయిన‌ట్టే. ఇక వీళ్లంతా షెడ్డుకి వెళ్లిపోక‌పోయ‌నా, మునుప‌టిలా రెచ్చిపోయి డ్యాన్సులు ఫైట్స్ చేస్తామంటే కుద‌ర‌దు. ర‌జ‌నీకాంత్‌లా ప్ర‌తిదీ సాంకేతికంగా మాత్ర‌మే మ్యానేజ్ చేయాలి. ఇక ఈ దుస్థితి లేకుండా టాలీవుడ్ పాన్ ఇండియ‌న్ స్టార్లు మాత్రం డూప్ లేకుండానే రియ‌ల్ స్టంట్స్, డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టేందుకు ఛాన్సుంది. పాన్ ఇండియా లేదా పాన్ వ‌ర‌ల్డ్ ని ఏలేందుకు ప్ర‌భాస్, అల్లు అర్జున్, చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ల‌కు చాలా పెద్ద స్కోప్ క‌నిపిస్తోంది.

Khans Feeling danger with Prabhas Raise:

Is Prabhas Raise danger bells For Khans

Tags:   PRABHAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ