Advertisementt

సందీప్ వంగాపై శివ సినిమా ప్ర‌భావం

Sun 02nd Nov 2025 10:17 PM
sandeep  సందీప్ వంగాపై శివ సినిమా ప్ర‌భావం
Sandeep Reddy about impact of Shiva సందీప్ వంగాపై శివ సినిమా ప్ర‌భావం
Advertisement
Ads by CJ

భార‌త‌దేశంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కులు ఎందరు ఉన్నా కానీ.. వారంతా సాధించ‌లేని క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ను సాధించి చూపిస్తున్నాడు సందీప్ వంగా. అత‌డి సినిమాలు ఎంత‌గా విమ‌ర్శ‌ల పాలైతే, అంత‌గా కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్, యానిమ‌ల్ .. ఈ సినిమాల‌న్నిటిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రాలు గ్రాండ్ స‌క్సెస్ సాధించాయి.

ప్ర‌స్తుతం సందీప్ వంగా తెర‌కెక్కిస్తున్న `స్పిరిట్`పై ప్ర‌జ‌ల ఫోక‌స్ ఉంది. అత‌డు ప్ర‌భాస్‌ని ఏ రేంజులో చూపించ‌బోతున్నాడో చూడాల‌న్న ఉత్సాహం అంద‌రిలోను ఉంది. ఇక సందీప్ వంగా వ్య‌క్తిగ‌తంగా ఇష్ట‌ప‌డే సినిమా ఏది? అంటే.. ఆర్జీవీ తెర‌కెక్కించిన `శివ` చిత్రం ఇప్ప‌టికీ గుర్తుండిపోయింద‌ని అన్నారు. 

త‌న‌ను అత్యంత ప్రభావితం చేసిన సినిమా ఇది అని వ్యాఖ్యానించారు. నాగార్జున‌, అమ‌ల‌, ర‌ఘువ‌ర‌ణ్, శుభ‌లేఖ సుధాక‌ర్ వంటి దిగ్గ‌జ తార‌ల‌తో కల్ట్ జాన‌ర్ లో తెర‌కెక్కించిన `శివ` చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది.

Sandeep Reddy about impact of Shiva :

Sandeep Reddy Vanga about impact of Shiva 4k re release

Tags:   SANDEEP
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ