Advertisementt

బాలయ్య కోసం భారీ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

Sun 02nd Nov 2025 10:04 AM
balakrishna  బాలయ్య కోసం భారీ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్
Director Planning Big For Balakrishna బాలయ్య కోసం భారీ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. అఖండ తాండవం డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఈలోపే బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబో మూవీకి కొబ్బరి కాయ కొట్టేసారు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం హిస్టారికల్ నేపథ్యంలో ఉండబోతుంది అనే టాక్ ఉంది.

అందుకోసమే గోపీచంద్ మలినేని తన టీమ్ తో కలిసి బాలయ్య చిత్రం కోసం లొకేషన్స్ వేటలో ఉన్నారట. అందులో భాగంగానే గోపీచంద్ మలినేని రాజస్థాన్ లోని పురాతన కొట్టడాలు, అక్కడ ఉన్న కోటలను పరిశీలిస్తున్నారట. గోపీచంద్ ఆయన టీమ్ అంతా లొకేషన్స్ పై రీ సెర్చ్ చేసి పక్కాగా సెట్ పైకి వెళతారని తెలుస్తుంది.

ఈ చిత్రంలోనే బాలకృష్ణ మరోసారి నయనతార తో జత కడుతున్నారని అంటున్నారు. వీర సింహ రెడ్డి కి మించి గోపీచంద్ మలినేని బాలయ్య తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారట. ఈ నెలలోనే బాలయ్య-గోపీచంద్ లు అఫీషియల్ గా రెగ్యులర్ షూటింగ్ కి వెళతారని తెలుస్తుంది. 

Director Planning Big For Balakrishna:

Gopichand Malineni Planning Big For Balakrishna

Tags:   BALAKRISHNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ