Advertisementt

హ‌రీష్‌కి పార్థిబ‌న్ గిఫ్ట్ సంథింగ్ స్పెష‌ల్

Sun 02nd Nov 2025 09:45 AM
harish shankar  హ‌రీష్‌కి పార్థిబ‌న్ గిఫ్ట్ సంథింగ్ స్పెష‌ల్
Why Harish Shankar gets emotional హ‌రీష్‌కి పార్థిబ‌న్ గిఫ్ట్ సంథింగ్ స్పెష‌ల్
Advertisement
Ads by CJ

కొన్నిసార్లు `కోట్లు` ఇవ్వ‌లేనిది ఒక్క `హ‌గ్` ఇస్తుంది. ప్రేమ ఆప్యాయ‌త‌లు.. అనురాగాలు అనుబంధాలు.. గౌర‌వం ఇచ్చి పుచ్చుకోవ‌డాలు ఇవ‌న్నీ హృద‌యాన్ని తాకే ఎమోష‌న‌ల్ ఎలిమెంట్స్. డ‌బ్బు ఎంత ఇచ్చినా ద‌క్క‌ని ఆనందం వీటితో మాత్ర‌మే ద‌క్కుతుంది. కానీ ఈరోజుల్లో కొర‌వ‌డిన‌ది ఇలాంటి ఆప్యాయ‌త‌లే. మ‌నుషుల మ‌ధ్య మంచి రిలేష‌న్ షిప్ దూరమైంది.

ఇలాంటి స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ని ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది ఈ ఘ‌ట‌న‌. వెట‌ర‌న్ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత పార్థిబ‌న్ ఒక అద్భుత‌మైన కానుక‌ను ఇచ్చారు. `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న పార్థిబ‌న్ త‌న షూటింగ్ ముగించిన క్ష‌ణం ద‌ర్శ‌కుడికి ఇచ్చిన గౌర‌వం, అత‌డిపై చూపించిన ఈ అభిమానం నిజంగా అరుదైన‌ది. ఇది ఎమోష‌నల్ ఘ‌ట్టానికి తెర తీసింది. ఈ కానుక ఏదైనా గిఫ్ట్ ఆర్టిక‌ల్ షో రూమ్ నుంచి కొనుగోలు చేసినది కాదు. ఇది మ‌న‌సుతో త‌యారు చేసిన‌ది.

ప్రేమ ఆప్యాయ‌త‌, అభిమానాన్ని పంచే కానుక‌. మ‌నుషుల మ‌ధ్య ఏం కావాలో చెప్పిన అరుదైన కానుక‌. అందుకే పార్థిబ‌న్ త‌న‌కు కానుక ఇవ్వ‌గానే హ‌రీష్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇది క‌చ్ఛితంగా స్పెష‌ల్ మెమెంటో అంటూ హ‌రీష్ స్వ‌యంగా పార్థిబ‌న్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Why Harish Shankar gets emotional:

  Harish Shankar gratitude for Parthiban  

Tags:   HARISH SHANKAR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ