భక్తి ఉండొచ్చు కానీ చచ్చేంత భక్తి పెట్టుకోమని, పెంచుకోమని ఏ దేవుడు చెప్పడు. కానీ దేవుడి పై విపరీతమైన నమ్మకం, భక్తి తో గుడులకు వెళ్లి అక్కడ తొక్కిసలాట జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ భక్తుల్లో మాత్రం భయం కానీ, లేదంటే ఆలోచన కానీ రావడం లేదు. తిరుపతి క్యూలైన్ లో తొక్కిసలాట, సింహాచలం లో తొక్కిసలాట, ఇలా ఎన్నో ఆలయాల్లో భక్తుల మితిమీరిన భక్తితో తొక్కిసలాటకు గురవుతున్నారు.
దేవుణ్ణి నమ్మొద్దు అని ఎవరూ చెప్పరు, కానీ వారి సేఫ్టీ కూడా వారు చూసుకోవాలి, భక్తుల కోసం ఆలయ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పట్లు చెయ్యాలి, అటు భక్తుల్లో సమన్వయ లోపం, ఇటు అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నోసార్లు తొక్కిసలాటలో భక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
నేడు కార్తీక ఏకాదశి. ఇదే రోజు శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ లో ఆలయంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి కావడంతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. రెయిలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు. దానితో భక్తులు తోసుకుంటూ తొక్కుంటూ గందరగోళంగా అవడంతో..
ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందడమే కాదు.. పలువురు గాయపడినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది..




నవంబర్ కి ఎందుకింత క్రేజ్ 

Loading..