Advertisementt

నవంబర్ కి ఎందుకింత క్రేజ్

Sat 01st Nov 2025 12:28 PM
ssmb29  నవంబర్ కి ఎందుకింత క్రేజ్
Why is there so much craze for November నవంబర్ కి ఎందుకింత క్రేజ్
Advertisement
Ads by CJ

ప్రతి నెలలో క్రేజీ సినిమాలు వస్తున్నాయి.. అందులో ఒక నెల లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తుంటే.. ఒక నెలలో ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే సినిమాలు వస్తున్నాయి. గత నెలలో విడుదలైన కాంతార చాప్టర్ 1 ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. పాన్ ఇండియా మార్కెట్ లో 800 కోట్లకు పైగా కొల్లగొట్టింది. 

ఈ నెలలోను క్రేజీ సినిమాల తాకిడి ఉండబోతుంది. అయితే ఈ నెల మాత్రం సినిమాల కోసం క్రేజీగా మారలేదు.. ఒకే ఒక్క సినిమా అప్ డేట్ కోసం నవంబర్ నెల క్రేజీగా మారిపోయింది. ప్రపంచమంతా ఆ ఒక్క అప్ డేట్ కోసం వెయిట్ చేస్తుంది. మహేష్-రాజమౌళి ల #GlobeTrotter అప్ డేట్ కోసం మహేష్ అభిమానులే కాదు వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది. 

రాజమౌళి నవంబర్ లో #SSMB29 అప్ డేట్ ఇస్తాను అన్నారు. ఈ నెల 16 న హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ చేతుల మీదుగా  #GlobeTrotter టైటిల్ టీజర్ తో పాటుగా ఇంకేం SSMB 29 పై బయటపెడతారో అనే విషయంలో అందరూ విపరీతమైన క్యూరియాసిటిలో ఉన్నారు. అందుకే అంతగా నవంబర్ ఎప్పుడు వస్తుందా అని  . 

మరి నవంబర్ లో సోషల్ మీడియా #GlobeTrotter అప్ డేట్ తో క్రాష్ అవడం మాత్రం ఖాయం. ఇది మహేష్ ఫ్యాన్స్ అంటున్న మాట. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాలి. 

Why is there so much craze for November:

November Month Started -SSMB29 GlobeTrotter update on the way

Tags:   SSMB29
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ