Advertisementt

మాస్ జాతర-శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే..

Fri 31st Oct 2025 08:00 PM
sreeleela  మాస్ జాతర-శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే..
Mass Jathara Cast Remuneration మాస్ జాతర-శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే..
Advertisement
Ads by CJ

ధమాకా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం నానా తంటాలు పడుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల మరికొన్ని గంటల్లో మాస్ జాతర తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. రవితేజ తో కలిసి రెండోసారి జత కట్టిన శ్రీలీల ఈ మధ్యన గ్లామర్ షో చెయ్యకపోతే సినిమా అవకాశాలు రావు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. 

ఇక ఇప్పుడు మాస్ జాతర చిత్రంలో శ్రీలీల మునుపుటి పాత్రలకు విభిన్నంగా పల్లెటూరి అమ్మయిగా కనిపించబోతుంది. ఇక ఎప్పటిలాగే మాస్ జాతర లోను శ్రీలీల డాన్స్ లు హైలెట్ అవ్వబోతున్నాయి. మాస్ జాతర ప్రమోషన్స్ లోను చాలా ఎనేర్జిగా అందంగా కనిపించిన శ్రీలీల కు మాస్ జాతర మేకర్స్ 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లుగా సమాచారం.

మరికాసేపట్లో ప్రీమియర్స్ తో సందడి చేసేందుకు రెడీ అయిన మాస్ జాతర కు మొత్తం గా రూ. 65 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే మాస్ జాతర చిత్రానికి హీరో రవితేజ రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినబడుతుంది. మరి మాస్ జాతర ప్రీమియర్స్ టాక్ ఏమిటో మరికాసేపట్లో.. 

Mass Jathara Cast Remuneration:

Sreeleela remuneration for Mass Jathara

Tags:   SREELEELA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ