హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా కొత్త సినిమాలను ప్రకటించడమే కానీ.. ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ ప్రోపర్ గా సెట్ పైకి వెళ్ళింది లేదు. రిషబ్ శెట్టి తో జై హనుమాన్ దగ్గరనుంచి నిన్న మహాకాళి వరకు ప్రశాంత్ వర్మ PVCU నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి.
అయితే ఇన్ని కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించిన ప్రశాంత్ వర్మ చాలామంది క్రేజీ టాప్ ప్రొడ్యూసర్స్ నుంచి అడ్వాన్స్ లు అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ దానయ్య కూడా ప్రశాంత్ వర్మ తో డీలింగ్ పెట్టుకుని అతనికి అడ్వాన్స్ ఇచ్చినట్లుగా టాక్ వినిపించింది.
అయితే ఈ గాసిప్స్ పై దానయ్య కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చింది. DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ ఏ ప్రాజెక్ట్ కోసమూ ఏ దర్శకుడికి అడ్వాన్స్ ఇవ్వలేదు. మాకు, దర్శకుడికి మధ్య వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదు. ఏదైనా వార్త ను స్ప్రెడ్ చేసేముందు అందులో అసలు నిజాలేమిటో తెలుసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ప్రెస్ నోట్ వదిలారు. దీనితో ప్రశాంత్ వర్మ తో దానయ్య డీల్ పెట్టుకోలేదనే విషయం స్పష్టత వచ్చింది.




దుబాయ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ 
Loading..