బిగ్ బాస్ సీజన్ 9 లోనే కాదు ఇప్పటివరకు ఏ సీజన్ లో కూడా ఓ కంటెస్టెంట్ చుట్టూ కంటెంట్ రావడమనేది లేదు. కానీ ఈ సీజన్ లో తనూజ ఇస్తున్న కంటెంట్ బిగ్ బాస్ కి కీలకమైంది. ఆమె లుక్, ఆమె మాటతీరుని చాలామంది ఇష్టపడుతున్నారు. కళ్యాణ్ తో ఆమె క్లోజ్ గా లేకపోయినా హౌస్ మేట్స్ తనూజ ను బ్లేమ్ చెయ్యడం చాలామందికి నచ్చడం లేదు. వైల్డ్ కార్డ్ కానివ్వండి, రీ ఎంట్రీ ఇస్తోన్న శ్రీజ, నామినేట్ చేసిన మనీష్ ఇలా అందరూ తనూజ ని టార్గెట్ చెయ్యడం ఆమెకు బయట సింపతీ పెరిగేలా చేసింది.
ఇక తనూజ నామినేషన్స్ లోకి వస్తే చాలు ఆమెను వోటింగ్ తో సపోర్ట్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్ లో నించోబెడుతున్నారు ఆడియన్స్. ఫ్రెండ్ అనుకున్న ఇమ్మాన్యువల్ తనూజ ను టార్గెట్ చెయ్యడం అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే నామినేషన్స్ లోనే తనూజ పవర్ చూపించేలా ఓట్లు గుద్దుతున్నారు. గత కొన్ని వారాలుగా నామినేషన్స్ లో ఉంటున్న తనూజ నెంబర్ 1 స్థానంలో ఉంచినట్టే ఈవారం ఆమెను నెంబర్ 1 పొజిషన్ లోనే నించోబెట్టారు.
ఇక తనూజ vs కళ్యాణ్ అన్న రేంజ్ లో గత వారం నుంచి ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారు. కళ్యాణ్ కూడా ఈ వారం వోటింగ్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. మూడో స్థానంలో సంజన ఉంది. ఆమె మాట తీరు నచ్చకపోయినా ఆమెకున్న స్ట్రాంగ్ పిఆర్ టీమ్ ఆమెను ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుకుంటుంది.
ఆతర్వాత గౌరవ్ నాలుగో స్థానంలో, రాము రాథోడ్ ఐదో స్థానంలో ఉన్నారు. ఈ వారం డేంజర్ జోన్ లో మాత్రం డెమోన్ పవన్, రీతు చౌదరి, మధురి దువ్వాడ లు ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.




 
                     
                      
                      
                     
                     శెభాష్ CM టీమ్
 శెభాష్ CM టీమ్

 Loading..
 Loading..