ఏపీ ని మొంథా తుఫాను ఒణికించేసింది. శ్రీకాకుళం నుంచి ఒంగోలు నెల్లూరు వరకు మొంథా అతలాకుతలం చేసేసింది. ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు పడిపోయి కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒకపక్క కరెంట్ లేక, వర్షంతో టవేరా ఇబ్బంది పడితే, కొంతమంది ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి అధికారులు చూపించిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.
మొంథా తుఫాను వలన జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. అందుకే కూటమి ప్రభుత్వం ముందుగానే తగిన చర్యలు, ఏర్పాట్లు చేసుకుని ప్రజలు ఇబ్బందులు పాలుకాకుండా, ఎవరూ తుఫాను ప్రభావంతో ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రపోకుండా అధికారులను నిద్రపోనివ్వకుండా పరుగులు పెట్టించారు. మిడ్ నైట్ వరకు చంద్రబాబు పనిచేస్తే మంత్రి నారా లోకేష్ తెల్లార్లు నిద్రలేకుండా అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రజలు ఇబ్బందులు పడకుండా CM టీమ్ తగిన చర్యలు తీసుకున్నారు.
కరెంట్ లేని చోట గంటల వ్యవధిలో మళ్లీ కరెంట్ పునరుద్ధరించడం, పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహారం అందించడం, వరదలు ఉన్న చోట తగిన చర్యలు తీసుకోవడం ఇలా ప్రతి విషయంలోనూ కూటమి ప్రభుత్వం అడుగడుగునా ప్రజలకు అందుబాటులో ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. లేదంటే మొంథా తుఫాను భీబత్సంతో ప్రజలు ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పడాల్సి వచ్చేదో..
కూటమి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు, సమయానుసారం సమస్యను చక్కబెట్టడం ఇలా అన్ని విషయాల్లో ఏపీ ప్రజలు.. కూటమి ప్రభుత్వం శెభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.




 
                     
                      
                      
                     
                     రాకాశి అలల ఎదుట మహేష్ అడ్వెంచర్
 రాకాశి అలల ఎదుట మహేష్ అడ్వెంచర్

 Loading..
 Loading..