Advertisementt

ఫ్యామిలీమ్యాన్-3 ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌

Tue 28th Oct 2025 04:34 PM
the family man 3  ఫ్యామిలీమ్యాన్-3 ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌
The Family Man 3 Streaming From This Date ఫ్యామిలీమ్యాన్-3 ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌
Advertisement
Ads by CJ

ఓటీటీ రంగంలో అత్యంత విజ‌య‌వంత‌మైన ఫ్రాంఛైజీ `ది ఫ్యామిలీమ్యాన్`. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ తొలి రెండు భాగాల‌ను స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. తెలుగు కుర్రాళ్ల ప‌నిత‌నానికి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఒక నిజ క‌థ‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డానికి ఓటీటీ మాధ్యమాన్ని ఎంచుకుని రాజ్ అండ్ డీకే చేసిన ప్ర‌యోగాలు ఇప్ప‌టివ‌ర‌కూ మిస్ ఫైర్ కాలేదు. `ది ఫ్యామిలీమ్యాన్`, `ది ఫ్యామిలీమ్యాన్ -2` రెండు సీజ‌న్లు ఘ‌నవిజ‌యం సాధించాయి. ఆ త‌ర్వాత డ్ర‌గ్స్ నేప‌థ్యంలో `ఫ‌ర్జీ` కూడా గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. సిటాడెల్ హ‌నీ బ‌న్ని కూడా భార‌త‌దేశంలో గొప్ప ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కించుకోవ‌డానికి రాజ్ అండ్ డీకే ఎగ్జిక్యూష‌న్ కార‌ణం.

ఇప్పుడు రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన `ది ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 3` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజా రిపోర్ట్ ప్ర‌కారం...`ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ -3 నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో దాదాపు 240 పైగా దేశాల‌లో  స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఈసారి కూడా అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్ శ్రీ‌కాంత్ తివారీ త‌న కుటుంబ స‌భ్యుల‌తో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూనే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొంటాడు. అత‌డి కెరీర్ కూడా రిస్కులో ప‌డుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో తివారీ పునఃప్ర‌వేశం చాలా ఫ‌న్నీగా న‌వ్వించింది. 

ఈసారి సిరీస్ లో జైదీప్ అహ్లావ‌త్, నిమ్ర‌త్ కౌర్ కీల‌క‌మైన విల‌న్ లుగా క‌నిపించ‌నున్నారు. తెలుగ‌మ్మాయి శ్రేయా ధ‌న్వంత‌రి ఈ సిరీస్ లో ఒక కీల‌క పాత్ర‌ను పోషించింది. సిరీస్ లో సీజ‌న్ 3 కి రాజ్ అండ్ డికె - సుమన్ కుమార్ సంయుక్తంగా ర‌చ‌నా విభాగంలో ప‌ని చేసారు. సుమిత్ అరోరా డైలాగులు అందించారు. రాజ్ & డికె- సుమన్ కుమార్, తుషార్ సేథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

The Family Man 3 Streaming From This Date:

The Family Man 3 Official Streaming Date

Tags:   THE FAMILY MAN 3
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ