Advertisementt

న‌టి బ‌ద్మాష్ రెస్టారెంట్ షాకిచ్చే ధ‌ర‌లు

Mon 27th Oct 2025 11:05 AM
mouni roy  న‌టి బ‌ద్మాష్ రెస్టారెంట్ షాకిచ్చే ధ‌ర‌లు
Mouni Roy Badmaash Menu న‌టి బ‌ద్మాష్ రెస్టారెంట్ షాకిచ్చే ధ‌ర‌లు
Advertisement
Ads by CJ

ఒక మ‌సాలా అప్ప‌డం వెల రూ.295.. రెండు గులాబ్ జామ్ ల‌ ధ‌ర రూ.410. అవ‌కాడో భేల్ ధ‌ర 395.. రొయ్య‌లు పీత‌లు తినాలంటే ఒక ప్లేట్ కి మినిమం 800 పెట్టాలి. సేవ్ పూరి 300. రోటీలు కొనాలంటే ఒక్కో రోటీకి 120 పైగా ఖ‌ర్చు చేయాలి. ఇదంతా ఏ రెస్టారెంట్ గురించి? అంటే.. అందాల క‌థానాయిక మౌనిరాయ్ నిర్వ‌హిస్తున్న‌ రెస్టారెంట్ ధ‌ర‌లు ఇవి.

అయితే ఇవ‌న్నీ స‌ర‌స‌మైన ధ‌ర‌లు.. ఎన్నో రెస్టారెంట్ల‌లో ధ‌ర‌లు ప‌రిశీలించి సెట్ చేసార‌ట‌. పైగా ప్ర‌జల అభిరుచి మేర‌కు రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను అందిస్తున్నామ‌ని చెబుతోంది మౌనిరాయ్. ముంబైలో శిల్పాశెట్టి బాస్టియ‌న్ లాంటి చోట్ల ఒక‌సారి ఫ్యామిలీ డైన్ చేయ‌డానికే రూ.50 వేలు పైగా ఖ‌ర్చు చేసిన సెల‌బ్రిటీలు ఉన్నారు. కొంద‌రు ల‌క్ష‌లు పెట్టేందుకు కూడా వెన‌కాడ‌ర‌ని క‌థ‌నాలొచ్చాయి. డ‌బ్బును విచ్ఛ‌ల‌విడిగా ఖ‌ర్చు చేయ‌డానికి ధ‌నికులు ఇలాంటి రెస్టారెంట్ల‌కు వెళుతుంటార‌ని, స్టాట‌స్ ని ప్ర‌ద‌ర్శించ‌డం కోసం ఎంత‌కైనా తెగిస్తార‌ని కూడా కొంద‌రు క్రిటిక్స్ విశ్లేషించారు. అయితే బాస్టియ‌న్ ను శిల్పాశెట్టి- కుంద్రా జంట ఇత‌రుల‌కు సేల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే మౌనిరాయ్ హోట‌ల్ లో ధ‌ర‌లు సామాన్యుల‌కు అందుబాటులో ఉన్నాయా? అంటే.. రూ.120కి ప్లేట్ ధ‌మ్ బిరియానీ తినాల‌నుకునే బాప‌తుకు ఈ ధ‌ర‌లు గిట్టుబాటు కానివి. అప్ప‌డం గులాబ్ జామ్ ల‌కే ఇంత భారీ ధ‌ర‌లు పెడితే, ఇక జేబు గుల్ల‌యిపోకుండా ఉంటుందా?  అయినా మౌని సినిమాలు చేసుకోకుండా ఇలాంటి తిండి వ్యాపారంలోకి ఎందుకు దిగింది? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మౌని రాయ్ కెరీర్ సంగ‌తి చూస్తే,... ఇటీవ‌ల స‌లాకార్ అనే చిత్రంలో క‌నిపించింది. బ్ర‌హ్మాస్త్ర‌లోను మౌని విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. 

Mouni Roy Badmaash Menu:

Mouni Roy Badmaash Restaurant Rates 

Tags:   MOUNI ROY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ