Advertisementt

భ‌ర్త‌తో విదేశాల్లో సెటిలైన తాప్సీ

Sun 26th Oct 2025 10:03 AM
taapsee  భ‌ర్త‌తో విదేశాల్లో సెటిలైన తాప్సీ
Taapsee Pannu addresses rumors of moving abroad భ‌ర్త‌తో విదేశాల్లో సెటిలైన తాప్సీ
Advertisement
Ads by CJ

ఇటీవ‌ల సౌత్ లో తాప్సీ ప‌న్ను సౌండ్ లేనే లేదు. పూర్తిగా ముంబైకే ప‌రిమిత‌మైపోయింది. బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ, హ‌బ్బీ ఆండ్రూ మాథియాస్ తో సంసారంలో త‌ల‌మున‌క‌లుగా ఉంది. అయితే ఇటీవ‌లి కాలంలో ముంబైలో కూడా సౌండ్ లేక‌పోవ‌డంతో తాప్సీ ఇక్క‌డ‌ పూర్తిగా బిచాణా ఎత్తేసి, డెన్మార్క్ లో సెటిలైపోయింద‌ని ప్ర‌చారం సాగిపోతోంది.

తాప్సీ త‌న భ‌ర్త‌తో క‌లిసి కాపురం చేసుకునేందుకు డెన్మార్క్ కి వెళ్లిపోయింద‌ని ఒక వెబ్ సైట్ క‌థ‌నం వెలువ‌రించ‌డంతో దానిపై ఇప్పుడు తాప్సీ చాలా సీరియ‌స్ గా రియాక్ట్ అయింది. తాను డెన్మార్క్ లో భ‌ర్త‌, అత్త‌మామ‌ల‌తో కాపురాన్ని స్థిరంగా సెటిల్ చేస్తున్నాన‌ని తెలిపింది. తామంతా ఒకే ఇంట్లో నివ‌శించేలా ప్లాన్ చేసాన‌ని, అక్క‌డ భార‌తీయ సంస్కృతిని కాపాడుతున్నాన‌ని చెప్పుకొచ్చింది. తాము ఉండే ఇంట్లోనే కింది పోర్ష‌న్ లో అత్త‌మామ‌లు నివ‌శిస్తున్నారని, డెన్మార్క్ సంస్కృతిలో ఇలా ఎవ‌రూ ఉండ‌ర‌ని కూడా చెప్పుకొచ్చింది.

భార‌త‌దేశంలో షూటింగులు శీతాకాలంలో జ‌రుగుతాయి. వీటిని మ్యానేజ్ చేసిన త‌ర్వాత వేస‌వి కాలం అంతా డెన్మార్క్ లో గ‌డుపుతున్నామ‌ని తాప్సీ వివ‌ర‌ణ ఇచ్చింది. వ‌ర్షాకాలం, ఎండాకాలం భార‌త‌దేశంలో షూటింగులు అరుదు. అందువ‌ల్ల డెన్మార్క్ లో భ‌ర్త‌తో హాయిగా కాలం గ‌డుపుతాన‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. ప్ర‌స్తుతం ముంబై లోనే నివ‌శిస్తున్నాన‌ని, త‌న సినిమాల‌ షూటింగులు పూర్తి చేస్తున్నాన‌ని తెలిపింది. తాప్సీ ప్ర‌స్తుతం క‌నిక థిల్లాన్ బ్యాన‌ర్ లో గాంధారి అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది.

Taapsee Pannu addresses rumors of moving abroad:

Taapsee has slammed a media portal for falsely reporting her shift abroad

Tags:   TAAPSEE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ