గత కొన్నాళ్లుగా సక్సెస్ దూరంగా ఉన్న హీరోయిన్.. రెండేళ్ల బ్రేక్ తో మళ్ళీ కోలీవుడ్ లో బిజీ అయిన హీరోయిన్ పూజ హెగ్డే. ఆమె ఇప్పుడొక సినిమా కోసం అందులోను నలుగురైదుగురు హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా కాదు కాదు స్పెషల్ సాంగ్ లో నటించేందుకు ఐదు కోట్లు డిమాండ్ చేసింది అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కోలీవుడ్ లో వరసగా ప్లాప్స్ అందుకున్న పూజ హెగ్డే పేరు కూలి చిత్రంలో చేసిన స్పెషల్ సాంగ్ మోనికా సాంగ్ తో సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఆ తర్వాత పూజ హెగ్డే తెలుగు లో దుల్కర్ సల్మాన్ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. మళ్లీ బిజీ అయిన పూజ హెగ్డే అల్లు అర్జున్-అట్లీ మూవీలో స్పెషల్ సాంగ్ చేసేందుకు మేకర్స్ ఆమెను సంప్రదించారట.
అల్లు అర్జున్-అట్లీ AA 22 చిత్రంలో దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్. ఆ తర్వాత జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి పూజ హెగ్డే కూడా వచ్చింది. ముందునుంచి AA 22 లో నలుగురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ ఉంది. అయితే ప్లాప్ లతో ఉన్న పూజ హెగ్డే ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో ఒక్క సాంగ్ కోసం 5 కోట్లు డిమాండ్ చేసిందనే న్యూస్ మాత్రం తెగ పాపులర్ అవుతోంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఏ డెసిషన్ తీసుకుంటారో చూద్దాం.




BB9: ఇమ్మాన్యువల్ ముసుగు తీసేసిన నాగ్

Loading..