బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 లతో పాన్ ఇండియా మార్కెట్ సంచలనానికి తెరలేపిన రాజమౌళి.. ఆ విషయంలో ఫుల్ గా సక్సెస్ అయ్యారు. ప్రభాస్, అనుష్క, రానా లతో బాహుబలి ని పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ చేసి సక్సెస్ కొట్టడమే కాదు కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డ్ లను నెలకొల్పారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ ని ప్రపంచమంతా గుర్తించింది.
ప్రభాస్ ఇండియా స్టార్ అవ్వగా.. రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఆర్.ఆర్.ఆర్ తో హాలీవుడ్ ని టచ్ చేసి ఆస్కార్ కి వెళ్లారు. అయితే ఇప్పుడు బాహుబలి ని రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాలను కలిపి ఒక సినిమాగా ఎడిట్ చేసి రీ రిలీజ్ లోనే సరికొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నారు. బాహుబలి ద ఎపిక్ గా ఈనెల 31 న రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.
యుఎస్ లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబలి ద ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. బాహుబలి ద ఎపిక్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఫాస్ట్ గా టికెట్స్ బుక్ చేస్తున్నారు. అప్పుడే బుక్ మై షో లో సోల్డ్ అవుట్ అంటూ కనిపించడం అందరికి షాకిస్తుంది. గంటకు 5 వేలకు బాహుబలి ది ఎపిక్ టికెట్లు తెగుతున్నాయంటే ఈ రీ-రిలీజ్ పై ఎంత క్రేజ్ ఉందొ అర్ధమవుతుంది.
మరి ఇప్పటివరకు ఈ రిలీజ్ కి లేని క్రేజు, మోజు బాహుబలి ద ఎపిక్ పై కనిపిస్తుంది. ఒరిజినల్ రిలీజ్ తోనే కాదు రీ రిలీజ్ తోనూ రాజమౌళి రికార్దుల వేట మొదలు పెట్టేసారు.




BB 9: మాధురి తో రమ్య కి గొడవ 

Loading..