బిగ్ బాస్ సీజన్ 9 లో నాగార్జున ఎపిసోడ్ లో నాగ్ ఎవరిని టార్గెట్ చేసి తప్పులను చెప్పి సరి చేస్తారా అని ఎదురు చూస్తే ఈరోజు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున రావడం రావడమే మాధురి కి రమ్య కి మధ్యన ఉన్న గొడవను చూపించారు. మాధురి సాయి ని అడుగుతుంది. రమ్య దగ్గరకు వెళ్లి ఆమె చెప్పినట్టు ఎందుకు వింటున్నావ్ అన్నవా, రమ్య నాకు చెప్పింది అంది మాధురి. మధురికి సాయి కి గొడవ జరుగుతుంది.
మీరు నోరు అదుపులో పెట్టుకో అంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకో అంటూ ఒకరికొకరు గొడవ పడ్డారు. దానితో రమ్య ని నువ్వు ఇక్కడికి రా అంటూ మాధురి అరిచింది. నీ లవ్వు నాకు కావాలి నన్నెందుకు దూరం పెట్టావ్ అంటూ సాయి చెప్పాడన్నావ్ అంది మాధురి రమ్య తో. నేను సాయి చెప్పాడని చెప్పనా.. నాకు నలుగురు చెప్పారు అన్నాను.
వాళ్ళు చెప్పారా, సాయి చెప్పాడా అని నువ్వడిగావ్ అంటూ రమ్య కూడా వాయిస్ రేజ్ చేసింది. మాధురి-రమ్య ఇద్దరూ తీవ్ర స్థాయిలో గొడవ పడుతుంటే ఇమ్మాన్యువల్ ఆపేందుకు ట్రై చేసిన ప్రోమో వదిలారు.




నటిపై అన్ని అనుమానాలకు జవాబు

Loading..