కన్నడ బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కన్నడ నటి దివ్య సురేష్.. రీసెంట్ గా బెంగుళూరులో యాక్సిడెంట్ చేసి పరారైన ఘటన కలకలం సృష్టించింది. తన కారుతో ఓ బైక్ ని ఢీ కొట్టిన దివ్య సురేష్ ఆ యాక్సిడెంట్ తర్వాత అక్కడ ఏం జరిగిందో, ఎవరికైనా గాయాలయ్యాయా అనేది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ యాక్సిడెంట్ లో బైకర్ కిరణ్, ఇంకా బైక్ పై ఉన్న అనూష కిందపడిపోగా మహిళకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. కిరణ్ ఈ యాక్సిడెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా.. సీసీ టివి ఫుటేజ్ ఆధారంగా కిరణ్ బైక్ ని యాక్సిడెంట్ చేసి తప్పించుకున్న కారు దివ్య సురేష్ దిగా, ఆ సమయంలో ఆమె కారుని డ్రైవ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
దివ్య సురేష్ పై హిట్ అండ్ రన్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడమే కాకుండా ఆమె కారును కూడా పోలీసులు సీజ్ చేయడం.. ఆతర్వాత దివ్య సురేష్ మళ్లీ తన కారును విడిపించుకున్నట్టుగా తెలుస్తోంది.




అఖండ2 బ్లాస్టింగ్ రోవర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ 

Loading..