Advertisementt

అఖండ2 బ్లాస్టింగ్ రోవర్ పై మిక్స్డ్ రెస్పాన్స్

Sat 25th Oct 2025 12:00 PM
akhanda 2  అఖండ2 బ్లాస్టింగ్ రోవర్ పై మిక్స్డ్ రెస్పాన్స్
Mixed response to Akhanda 2 blasting rover అఖండ2 బ్లాస్టింగ్ రోవర్ పై మిక్స్డ్ రెస్పాన్స్
Advertisement
Ads by CJ

అఖండ 2 తాండవం నుంచి అఘోర పాత్రకు సంబందించిన గ్లింప్స్ వదిలినప్పుడు అఘోర లుక్ లో బాలయ్య శివతాండవం చూసి ఆహా ఓహో అన్నవారే.. ఇప్పుడు బాలకృష్ణ సెకండ్ కేరెక్టర్ నుంచి వదిలిన బ్లాస్టింగ్ రోవర్ పై పెదవి విరుస్తున్నారు. అఖండ 1 లో బాలకృష్ణ పాత్ర ఎలా ఉందొ అఖండ 2 లో బాలయ్య పాత్ర అలానే ఉంది. 

అది ఓకె కానీ.. అదే యాక్షన్, అదే డైలాగ్ డెలివరీ అంటూ నందమూరి అభిమానులే మాట్లాడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు అఖండ 2 తాండవం బ్లాస్టింగ్ రోవర్ చూసాక నాకు కొత్తగా ఏమి అనిపించలేదు, అఖండ 1 టీజర్ చూసినట్టే ఉంది అంటూ మాట్లాడడం, ఇంకా చాలామంది కూడా అఖండ 2 బ్లాస్టింగ్ రోవర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. 

మరికొంతమంది బోయపాటి మరోసారి కొట్టడం ఖాయం, బాలయ్య విశ్వరూపాన్ని అటు అఘోర పాత్ర ఇటు సెకండ్ కేరెక్టర్ లో పవర్ ఫుల్ గా  చూపిస్తున్నారు, బాలయ్య-బోయపాటి కలిస్తే నెక్స్ట్ లెవల్ అంటూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా లో అఖండ 2 బ్లాస్టింగ్ రోవర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది కొంతమంది నందమూరి అభిమానులను డిస్ట్రబ్ చేస్తుంది. 

Mixed response to Akhanda 2 blasting rover:

Akhanda 2 Thaandavam Blasting Roar Public Talk

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ