కొద్ధి నెలలుగా బంగారం, వెండి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్నాళ్లుగా వేలకు వేలు పెరిగిపోతూ పసిడి పరుగులు పెడుతుంది. పెరిగితే వేలల్లో, తగ్గితే వందల్లో బంగారం ధరలు ఉంటున్నాయి. ఇక సిల్వర్ అయితే చెప్పక్కర్లేదు. దాదాపుగా 2 లక్షలకు పైగా కేజీ వెండి ధర కనిపించింది. అమ్మో అని అందరూ గుండెల మీద చెయ్యి వేసుకున్నారు. బంగారం కొనాలంటే భయం, సిల్వర్ గురించి మాట్లాడాలంటే ఒణుకు. అలా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి.
కొద్దిరోజులుగా వెండిధర పది పది వేలు పడిపోతూ వస్తుంటే.. బంగారం ధరలు కూడా నేలను చూస్తున్నాయి. ఆకాశానికి ఎగబాకిన బంగారం ఇప్పుడు దిగొస్తుంది. రెండురోజుల క్రితం లక్ష ముప్పై వేలు ఉన్న బంగారం ధర నిన్న బుధవారం రెండుసార్లు పతనమైంది. ఉదయం మూడు వేలు తగ్గిన బంగారం ధర సాయంత్రానికి ఆరు వేలు తగ్గింది.
అంటే ఒక్క రోజే కనకం 9 వేలు తగ్గడం పై అందరిలో ఆశ మొదలయ్యింది. ప్రస్తుతం 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర లక్ష 14 వేలు ఉంది. మరి లక్ష ముప్పై దాటిన పసిడి ధర అమాంతం తగ్గినట్లే. అయితే బంగారం ధరలు తగ్గుదలతో దానిపై ఇన్వెస్ట్ చేసిన వారు తెగ ఫీలైపోతున్నారు. బాగా పెరుగుతున్న బంగారం ధర చూసి లక్షల్లో కొని నిల్వచేసారు.
కానీ ఇప్పుడు పసిడి ధర తగ్గడం వాళ్లని టెన్షన్ పడేలా కనిపిస్తుంది. కానీ సామాన్యులకు మాత్రం కనకం ధర దిగిరావడం కాస్త ఊరటనిచ్చింది అనే చెప్పాలి.




ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ OG 

Loading..