పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ OG. సెప్టెంబర్ 25 న థియేటర్స్ లో విడుదలైన ఓజి చిత్రానికి యునానమస్ గా హిట్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ విషయం వచ్చేసరికి కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేసింది. ఏది ఏమైనా పవన్ అభిమమానులను ఓజి ఫుల్ గా ఇంప్రెస్స్ చేసింది.
పవన్ లుక్స్, ఆయన గంభీర పాత్ర ఫ్యాన్స్ కి నచ్చేసాయి. కామన్ ఆడియన్స్ కూడా చాలా రోజుల తర్వాత పవన్ స్ట్రయిట్ కథతో హిట్ కొట్టారన్నారు. సెప్టెంబర్ 25 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై పవన్ ఫ్యాన్స్ కన్నేశారు. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ తో హిట్ చెయ్యాలని కసి తో కూర్చున్నారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓజి డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిస్క్ ఎప్పుడెప్పుడు ఓజిని స్ట్రీమింగ్ చేస్తుందా అని ఎదురు చూసిన వాళ్లకు ఈరోజు అంటే అక్టోబర్ 23 నుంచి ఓజి ని స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా ప్రకటించడమే కాదు గత రాత్రి నుంచి ఓజి ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చేసింది.
సో థియేటర్స్ లో మిస్ అయిన, పవన్ ఫ్యాన్స్ రిపీటెడ్ గా చూసేవాళ్లకు ఓజి ఈరోజు నుంచి ట్రీట్ ఇస్తుందన్నమాట.




ప్రభాస్ బర్త్ డే స్పెషల్ 

Loading..