రష్మిక మందన్న హిందీలో టాప్ గేర్ లో దూసుకుపోతున్న భామ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. సికిందర్ పెద్ద షాక్ ఇస్తే.. ఛావా తో రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది. పుష్ప చిత్రం ఆమెను హిందీలో బిజీ చేసింది. పుష్ప తో బాటలు వేసుకుని ఇప్పుడు హిందీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.
ప్రస్తుతం రష్మిక నటించిన లేటెస్ట్ చిత్రం థామా థియేటర్స్ లో సందడి చేస్తుంది. థామా చిత్రానికి బాలీవుడ్ నుంచి మిగతా లాంగ్వేజెస్ లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. హార్రర్ కామెడీ గా తెరకెక్కిన థామా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నా, రష్మిక తనవంతుగా బేతాళ పాత్రలో అద్భుతమైన పెరఫార్మెన్స్ చూపించిన థామా కి మాత్రం జస్ట్ సో సో టాక్ రావడం రష్మిక ను డిజప్పాయింట్ చేసింది.
యానిమల్ కి మించి రష్మిక మందన్న థామా చిత్రంలో అందాలు ఆరబోసింది, మరో గ్లామర్ లేడీ మలైకా అరోరాతో కలిసి గ్లామర్ షో తో సాంగ్ లో చిందులు వేసింది. టోటల్ గా రష్మిక షో బాగుంది.. ఆమె ఈ సినిమాకి మెయిన్ హైలెట్ కానీ ఓవరాల్ గా థామానే ఆడియన్స్ ని 100 శాతం ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.




డ్యూడ్ వెంటపడుతున్న ఇళయరాజా 

Loading..