హిందీలో అనూహ్యంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న సౌత్ భామ రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగు, తమిళనాట టాప్ పొజిషన్ కి చేరుకొని పుష్ప చిత్రంతో హిందీలోకి ఎంటర్ అయ్యి అక్కడ టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఈ దీపావళి కి థామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నిన్న అక్టోబర్ 21 న విడుదలైన థామా చిత్రానికి బిగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా థామా జర్నీ పై ఎమోషనల్ అవుతూ.. థామా గురించి ఏం చెప్పాలి, ఈ జర్నీ గురించి ఎలా మాట్లాడాలి, థామా షూటింగ్ మొదటి
రోజు నుంచి చివరిరోజు వరకూ ప్రతిదీ మనసుకు హత్తుకున్నదే. కేవలం పని చేయడమే కాదు.. కామెడీ, దెబ్బలు, నిద్ర లేని రాత్రులు, లేవాలనిపించని ఉదయం, అప్పుడే షూటింగ్ అయ్యిపోయింది అనే రాత్రి అన్ని చాలా కొత్తగా అనిపించాయి.
దర్శకుడు ఆదిత్య నాపై నమ్మకంతో దీన్ని రూపొందించారు. సినిమా షూటింగ్ కష్టమంతా సినిమా విడుదలయ్యాక వచ్చే పాజిటివ్ కామెంట్స్ తో మర్చిపోతాం.
ఇక అభిమానుల గురించి మాట్లాడుతూ.. మీ ప్రేమ, మద్దతు, నమ్మకం అన్నిటినీ నేను చూస్తున్నాను, మీ అభిమానానికి ఎప్పటికి అందరికీ రుణపడిపోయి ఉంటాను అంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా థామా జర్నీపై రాసుకొచ్చింది.




మెగాస్టార్ ఇంట్లో నయనతార భర్త-కొడుకులు 

Loading..