పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే రేపు. అక్టోబర్ 23 అంటే ప్రభాస్ అభిమానులకు పండగే. ప్రభాస్ కొత్త సినిమాల నుంచి వచ్చే అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అభిమానులు. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ద రాజా సాబ్ నుంచి మేకర్స్ హడావిడి కనిపించడం లేదు. రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పై అనుమానాలు ఉన్నాయి.
మరోపక్క హను రాఘవపూడి ప్రభాస్ తో చేస్తున్న ఫౌజీ మూవీ నుంచి రేపు విడుదల చెయ్యబోయే టైటిల్ అప్ డేట్ పై గత రెండు రోజులుగా విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. రేపు గురువారం ఫౌజీ నుంచి 11.07 నిమిషాలకు టైటిల్ గ్లింప్స్ వదలబోతున్నట్టుగా ప్రీ లుక్ ని వదిలారు ఈరోజు.
ప్రభాస్ ని ఫౌజీ ప్రీ లుక్ లో చూసి అభిమానులు విపరీతంగా ఎగ్జైట్ అవుతున్నారు. హను రాఘవపూడి ఫౌజీ ప్రీ లుక్ తోనే హైపెక్కించారు. మరి బర్త్ డే కి ఫౌజీ టైటిల్ గ్లింప్స్ తో ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి.




నారా రోహిత్-శిరీష వెడ్డింగ్ డేట్ ఫిక్స్ 

Loading..