గత ఏడాది హీరోయిన్ సిరి లెల్ల అక శిరీష తో నిశ్చితార్ధం చేసుకున్న హీరో నారా రోహిత్ ఏడాది కి పెళ్లి పీటలెక్కుతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 30 న నారా రోహిత్-సిరి లెల్ల వివాహానికి ముహూర్తం ఫిక్స్ చెయ్యడంతో శిరీష కుటుంబంలో పసుపు కొట్టే కార్యక్రమంతో ఇప్పటికే నారా రోహిత్-శిరీష ల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు వెడ్డింగ్ డేట్ కూడా రివీల్ అయ్యింది. ఈ నెల 30 న నారా రోహిత్-శిరీష ల వివాహాన్ని జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. ప్రతినిధి 2 సెట్ లో ప్రేమలో పడిన నారా రోహిత్ సిరి లు గత ఏడాది పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే నారా రోహిత్ తండ్రి మరణించడంతో.. నారా రోహిత్-సిరి ల వివాహం పోస్ట్ పోన్ అయ్యింది.
ఇక తాజాగా తండ్రి ఏడాది మాసికం పూర్తి కాగానే నారా రోహిత్ పెళ్ళికి ముహుర్తాలు పెట్టేసారు. ఈ పెళ్ళికి పెద్దగా ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరిలు వ్యవహరించనున్నారు. లోకేష్, బ్రాహ్మణి పెళ్లి పనులు చూసుకుంటారని, బాలకృష్ణ ఈ పెళ్ళిలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారని తెలుస్తుంది.




జీరో నుంచి హీరోగా ఎదిగిన గాయకుడు

Loading..