Advertisementt

కుమార్తెను ఇంట్రడ్యూస్ చేసిన దీపికా-రణవీర్

Tue 21st Oct 2025 10:44 PM
dua  కుమార్తెను ఇంట్రడ్యూస్ చేసిన దీపికా-రణవీర్
Deepika and Ranveer introduce daughter కుమార్తెను ఇంట్రడ్యూస్ చేసిన దీపికా-రణవీర్
Advertisement
Ads by CJ

చాలామంది సినీ సెలబ్రిటీస్ తమ పిల్లలను ప్రపంచానికి, అభిమానులకు చూపించేందుకు, పబ్లిక్ గా అందరికి ఇంట్రడ్యూస్ చేసేందుకు చాల సమయం తీసుకుని ఓ స్పెషల్ అకేషన్ పెట్టుకుని అప్పుడు తమ పిల్లలను చూపిస్తుంటారు. గతంలో అలియా భట్-రణబీర్ లు తమ కుమార్తె రాహా ని అలానే పరిచయం చేసారు. ఇక రీసెంట్ గా కియారా-సిద్దార్థ్ మల్హోత్రాలు తల్లితండ్రులయ్యారు. కానీ తమ కుమార్తెను చూపించలేదు. 

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణవీర్ సింగ్-దీపికా పదుకొనే లకు పాప పుట్టింది. అయితే తమకు కుమర్తె పుట్టినట్లుగా చెప్పి పేరు దువా పదుకొణె సింగ్‌ గా రివీల్ చేసిన రణవీర్ - దీపికా లు ఇప్పటివరకు కుమార్తెను పరిచయం చెయ్యలేదు. 

ఇప్పుడు దీపావళి సందర్భంగా దీపికా-రణవీర్ సింగ్ లు తమ కుమార్తెను అందరికి ఇంట్రడ్యూస్ చేసారు. చక్కగా రెండు పిలకలు వేసి తమ కుమార్తెను పరిచయం చేసారు. రెడ్ డ్రెస్ లో దీపికా కూతురు చక్కగా క్యూట్ గా బుజ్జిగా కనిపించింది. దీపికా కూతురు దువా పదుకొణె సింగ్‌ మాత్రం చాలా క్యూట్ గా ముద్దొచ్చేసేలా ఉంది. కుమార్తె తో కలిసి దీపికా దివాళి ని సెలెబ్రేట్ చేసుకుంది. 

Deepika and Ranveer introduce daughter:

Dua Padukone Singh first picture revealed

Tags:   DUA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ