Advertisementt

దివాళి చిత్రాలకు అసలు పరీక్ష స్టార్ట్

Tue 21st Oct 2025 09:53 PM
diwali  దివాళి చిత్రాలకు అసలు పరీక్ష స్టార్ట్
The real test for Diwali films begins దివాళి చిత్రాలకు అసలు పరీక్ష స్టార్ట్
Advertisement
Ads by CJ

దీపావళి ఫెస్టివల్ స్పెషల్ గా గత వారం విడుదలైన నాలుగు చిత్రాల్లో రెండు షెడ్డు కెళ్ళిపోయాయి. లిటిల్ హార్ట్స్ రేంజ్ లో మిత్ర మండలి కూడా హిట్ అవుతుంది అనుకుంటే అది మాత్రం థియేటర్స్ లో అవుట్ అయ్యింది. ఇక టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా కూడా యూత్ ని బాగా డిజప్పాయింట్ చేసింది. వీకెండ్ లోను తెలుసు కదా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 

ఇక తమిళ డ్యూడ్ తెలుగులోనూ ప్రేక్షకులకు కనెక్ట్ అవడంతో తెలుగు, తమిళ్ లో డ్యూడ్ 100 కోట్లకు చెరువులోకి వచ్చింది. ఇక థియేటర్స్ లో సో సో అనిపించి, క్రిటిక్స్ నుంచి పూర్ రేటింగ్స్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మెల్లగా యూత్ కి కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్ లో డ్యూడ్ మంచి నెంబర్లు నమోదు చేసింది. 

ఇప్పటివరకు ఓకే అంటే నిన్న దివాళి సోమవారం వరకు ఈ డ్యూడ్, K-ర్యాంప్ చిత్రాల పెరఫార్మెన్స్ బావుంది. కానీ ఈరోజు మంగళవారం నుంచి ఈ దివాళి విన్నర్స్ కి అసలు పరీక్ష మొదలయ్యింది. చూద్దాం ఈ రోజు థియేటర్స్ లో K -ర్యాంప్, డ్యూడ్ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో రేపు తెలిసిపోతుంది. 

The real test for Diwali films begins:

Toughest Weekday Test Begins For Diwali Releases

Tags:   DIWALI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ