బిగ్ బాస్ సీజన్ 9 ఏడో వారం లోకి ఎంటర్ అయ్యింది. ఈ వారం భరణి ఎలిమినేట్ అవుతుంటే తనూజ, దివ్య లు విపరీతంగా ఏడ్చేశారు. భరణి ఆట నచ్చినా ప్రేక్షకులు ఆయన బంధాలు నచ్చక ఎలిమినేట్ చేసారు. ప్రేక్షకులే కాదు భరణి నమ్మిన ఇమ్మాన్యువల్ మోసం చేసి ఎలిమినేట్ అయ్యేలా చేయడమే భరణిని బాధపెట్టింది.
ఇక ఈ రోజు సోమవారం నామినేషన్స్ లో హౌస్ మొత్తం రచ్చ రచ్చ అయ్యింది. ఇమ్మాన్యువల్, అయేషా లు నామినేషన్ పవర్ పొందేందుకు బెలూన్స్ పగలగొట్టి నామినేషన్స్ చీటీలు తెమ్మన్నాడు బిగ్ బాస్. అయేషా కి నామినేషన్స్ చీటీలతో పాటుగా డైరెక్ట్ నామినేషన్ పవర్ దొరికింది. దానితో అయేషా రీతూ కి ఫోమ్ ని పూస్తూ డైరెక్ట్ గా నామినెట్ చేసున్నా అంది.
అంతలో రీతూ ఒక్క నిమిషం తుడుచుకోనివ్వు అంది.. నువ్వు వెళ్లెవరకూ మేము వెయిట్ చెయ్యాలా, నువ్వు నీ ఓవరేక్షన్ ఈ ఇంట్లో నాకు నచ్చలేదు అంటూ అయేషా ఫైర్ అయ్యింది. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం అంటూ రీతూ ని పాయింట్ అవుట్ చెయ్యడమే కాదు రీతూ ఏదో అనబోతుంటే నువ్వెంటే నాకు చెప్పేది అంటూ అయేషా మాట్లాడిన మాటలు మాత్రం రీతూ ని హార్ట్ చేసాయి.
రీతూ నువ్వేమన్నా డిపెండ్ చేసుకోవాలనుకుంటున్నావా అని రీతూ ని బిగ్ బాస్ అంటే.. అయేషా మాత్రం రీతూ ఏం చెప్పినా నేను కన్విన్స్ అవ్వను, ఆమె యాటిట్యూడ్, ఆమె గేమ్ నాకు నచ్ఛలేదు అంటూ రీతూ ని నామినేట్ చేసింది. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో లో రీతూ vs అయేషా అన్నట్టుగా నడిచింది.




బిగ్ బాస్: శనివారం ఎపిసోడ్స్ చాలు

Loading..