బిగ్ బాస్ సీజన్ 9 పై ప్రేక్షకుల్లో క్రేజ్ ఎలా ఉందొ అనేది అందరికి తెలుసు. అసలు ఎలాంటి ఆసక్తి లేదు అనేది జగమెరిగిన సత్యం. మధ్యలో కాస్త బావున్నా వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చాకా చాలామంది ఆడియన్స్ బిగ్ బాస్ ని చూడడమే లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దివ్వెల మాధురి, అయేషా లాంటి వాళ్ళు వల్లనే తాము ఈ షో చూడడం లేదు అంటున్నారు.
మరోపక్క టాస్క్ ల కన్నా హౌస్ లో సొల్లు మాట్లాడడం, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో తగవులు పెడుతున్నారు. అది చాలా చిరాగ్గా ఉంది అంటున్నారు. కేవలం నాగార్జున వచ్చే శనివారం ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంప్రెసివ్ గా ఉంది. సండే ఎపిసోడ్ కూడా సో సో గానే ఉంటుంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
శనివారమైతే నాగార్జున రావడం రావడమే కంటెస్టెంట్స్ తప్పులను చూపించడమే కాదు వారిని వార్న్ చెయ్యడం, ఆయన హౌస్ మేట్స్ పై ఫైర్ అవడం ఆడియన్స్ కి నచ్చేస్తుంది. అందుకే నాగార్జున శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అంటే శనివారం ఎపిసోడ్ ఎంత నచ్చేస్తుందో అర్ధమవుతుంది.
ఇక సండే ఎపిసోడ్ ఎలిమినేషన్ శనివారమే జరగడంతో ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో అనేది శనివారమే లీకవడం కూడా బిగ్ బాస్ కి మైనస్ గా మారింది.




షాకింగ్: నటుడి శరీరంపై 119 కుట్లు

Loading..