Advertisementt

మొదలైన హీరోయిన్ పెళ్లి పనులు

Mon 20th Oct 2025 10:06 AM
nara rohith wedding  మొదలైన హీరోయిన్ పెళ్లి పనులు
Nara Rohith - Siree Lella wedding works Started మొదలైన హీరోయిన్ పెళ్లి పనులు
Advertisement
Ads by CJ

ప్రతినిధి 2 షూటింగ్ లో ప్రేమలో పడిన మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు నారా రోహిత్ - హీరోయిన్ సిరి లెల్ల ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్నారు. నారా రోహిత్,  సిరి లెల్ల ను గత ఏడాది అక్టోబర్ లో నిశ్సితార్ధం చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకుందామనుకున్న తరుణంలో నారా రోహిత్ తండ్రి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో నారా రోహిత్ పెళ్లి వాయిదాపడింది. 

రీసెంట్ గానే తండ్రి ఏడాది మాసికం పూర్తి చేసిన నారా రోహిత్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి ముహుర్తాలు కూడా చూసుకోవడంతో అటు సిరి లెల్ల ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమంతో పెళ్లి పనులకు సిరి కుటుంబ సభ్యులు శ్రీకారం చుట్టారు. అందుకు సంబందించిన ఫోటోలను సిరి లెల్ల సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

నారా రోహిత్ ఇంట్లో పెళ్లి పనులు సైలెంట్ గా మొదలైనా.. సిరి లెల్ల ఇంట్లో మాత్రం తన ఫ్యామిలీ మెంబెర్స్ తో సెలెబ్రేషన్స్ తో పుసుపు కొట్టే కార్యక్రంతో పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఈ వేడుకలో సిరి గ్రీన్ శారీ లో క్యూట్ గా బ్యూటిఫుల్ గా సిగ్గుపడుతూ కనిపించింది. త్వరలోనే రోహిత్-సిరిల వివాహం జరగబోతుంది. 

Nara Rohith - Siree Lella wedding works Started:

  It’s time for Nara Rohith - Siree Lella wedding works  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ