బిగ్ బాస్ సీజన్స్ లో దివాళి ఈవెంట్ కి గెస్ట్ గా రావడమే కాదు.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ జాతకాలు చెప్పేసే హైపర్ ఆది ఈ సీజన్ 9 కి దివాళి ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడమే కాదు సీజన్ 9 లోని కంటెస్టెంట్స్ జాతకాలు చెప్పి అలెర్ట్ చేస్తూనే కడుపుబ్బా నవ్వించేసాడు. అంతేకాదు బయట.. వాళ్లకు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది, వారి ఆట ఎలా ఉంది అనేది చెపేప్సాడు.
భరణి ని నాన్నా అంటూ అన్న అంటూ ఆయన ఆట పాడు చేసారు. సంక్రాంతి సీజన్ లో వీరిపై ఓ ఫ్యామిలీ డ్రామా చేసేందుకు దర్శకులు రెడీగా ఉన్నారన్నాడు. సంజన మీ దొంగతనాలు, మీరు చేసే హడావిడి మాములుగా లేదు. మిమ్మల్ని ఇమ్ము అమ్మా అంటూ సొంత అమ్మనే మర్చిపోయాడు. మీ ఆటను మీరే స్పాయిల్ చేసుకుంటారు అన్నాడు. ఇమ్మాన్యువల్ నీ గేమ్ బావుంది కానీ.. నువ్వు ఎంతగా నవ్విస్తున్నావో అంతగా ఏడుస్తున్నావు. సేఫ్ గేమ్ సైడ్ కి వెళ్ళకు అని అలెర్ట్ చేసాడు.
సుమన్ అన్న నువ్వు నీ ఆట చాలా కూల్ గా ఉంటుంది. నామినేషన్స్ లోను, ఆటలో సైలెంట్ గా చెప్పకు, నువ్వు, నీ ఆటను, నీ కామెడీని ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు అన్నాడు.
అయేషా చేసిన తప్పుకి డైరెక్ట్ గా ఆది ఇచ్చి పడేసాడు. నామినేషన్స్ లో నువ్వు తనూజ కి చెప్పిన పాయింట్స్ నువ్వు చేస్తున్నావా అన్నాడు. ఇక మాధురి గారు మీరు మాట్లాడుతుంటే బిగ్ బాస్ కాఫీ తాగడానికి వెళుతున్నాడు అంటూ కామెడీ చేసాడు. పవన్-రీతూ కి కూడా సరదాగానే ఇచ్చి పడేసాడు. తనూజ నువ్వు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యావ్ కానీ.. నీ ఆట నువ్వు ఆడు. నాన్న నాన్న అంటూ ఆట పాడు చేసుకోకు అంటూ సలహా ఇచ్చాడు.
ఏది ఏమైనా ఆది వచ్చిన కాసేపు బిగ్ బాస్ ఆదివారం దివాళి ఎపిసోడ్ మాత్రం అల్లడించేసాడు.




సిస్టా›్ల ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఓపెనింగ్

Loading..