హీరో విశాల్ రీసెంట్ గానే తన గర్ల్ ఫరెండ్ హీరోయిన్ సాయి ధన్సిక తో ఎంగేజ్మెంట్ చేసుకుని నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కాగానే వివాహం చేసుకుంటానని ప్రకటించారు. ఈలోపే విశాల్ తన సినిమా డైరెక్టర్ తో గొడవపడ్డాడంటూ వార్తలొచ్చాయి. తాజాగా విశాల్ ఫిలిం అవార్డ్స్ పై చేసిన కామెంట్స్ సెన్సేషనల్ అయ్యాయి. యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ పాడ్ కాస్ట్ లో విశాల్ చాలా విషయాలు పంచుకున్నారు.
తన కెరీర్ లో సవాలు విసిరిన పాత్ర అవన్-ఇవన్. ఆ చిత్రం కోసం మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడ్డాను, కానీ మరోసారి అలాంటి పాత్రలో నటించను, కోట్లు ఆఫర్ చేసినా ఇకపై అలాంటి రోల్ చెయ్యను అని చెప్పిన విశాల్ అవార్డ్స్ పై కూడా స్పందించారు. తనకు నేషనల్ అవార్డ్స్ కానీ, లేదంటే మిగతా అవార్డులు కానీ నచ్చవని..
జ్యూరీగా ఉండే ఏడెనిమిది మంది బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీని ఎలా డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ అభిప్రాయాలు సేకరించి బెస్ట్ మూవీ, యాక్టర్స్ ని సెలక్ట్ చెయ్యాలి. నాకు అవార్డ్స్ రాలేదు అని అలా మాట్లాడం లేదు. ఒకవేళ నాకు ఏదైనా అవార్డు వచ్చినా దాన్ని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తాను.
నాకొచ్చిన అవార్డు గనక బంగారంతో తయారు చేయించిందైతే.. ఆ అవార్డు ని అమ్మేసి, వచ్చిన డబ్బును ఛారిటీకి విరాళం ఇస్తా అంటూ విశాల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.




BB9-ఎమోషనల్ అవుతున్న శ్రీజ దమ్ము 

Loading..