నిజమే ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లు డిజప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే తెలుసు కదా చిత్రంతో సక్సెస్ అందుకోవాలని ఆరాటపడి ఇప్పుడు నిరాశ పడిపోతున్నారు. సిద్దు జొన్నలగడ్డతో కలిసి నటిస్తే సక్సెస్ వస్తుంది.. టాలీవుడ్ లో కమ్ బ్యాక్ అవ్వొచ్చని ఆశపడి ఇప్పుడు డిజప్పాయింట్ అయ్యారు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలు.
తెలుసు కదా చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని ఓ వర్గం ఆడియన్స్ అంటే క్లాస్ ఆడియన్స్ నచ్చింది అన్నారు, కానీ చాలామందికి తెలుసు కదా కనెక్ట్ అవ్వలేదు. దానితో ఈ చిత్రం సో సో రిజల్ట్ తో సరిపెట్టుకుంది. సిద్దు జొన్నలగడ్డ పెరఫార్మెన్స్ తో పాటుగా హీరోయిన్స్ ఇద్దరూ అద్దరగొట్టేసారు.
గ్లామర్ గాను, పెరఫార్మెన్స్ తోనూ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లు ఆకట్టుకున్నారు. కానీ తెలుసు కదా సినిమా రిజల్ట్ వాళ్ళను డిజప్పాయింట్ చేసింది. ఇక ఇప్పుడు రాశి ఖన్నా కి ఉస్తాద్ భగత్ సింగ్ పైనే హోప్స్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా కు తెలుసు కదా షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.




రీతూ వర్మ సింపుల్ లుక్ 

Loading..