Advertisementt

మహేష్ ఫ్యాన్స్ ఇక రెడీ అవ్వండి

Sun 19th Oct 2025 10:11 AM
rajamouli  మహేష్ ఫ్యాన్స్ ఇక రెడీ అవ్వండి
Mahesh fans, get ready now మహేష్ ఫ్యాన్స్ ఇక రెడీ అవ్వండి
Advertisement
Ads by CJ

ఎప్పటినుంచో మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న SSMB 29 అప్ డేట్ కి సమయం ఆసన్నమైంది. దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కిస్తున్న SSMB 29 చిత్ర షూటింగ్ విశేషాలు, అసలు కథ కమామిషు ని ఎప్పుడు రివీల్ చేస్తారా అని అందరూ ఎదురు చూడని రోజు లేదు. 

నవంబర్ లోనే మహేష్ సినిమా అప్ డేట్ ఉంటుంది అని ఆగష్టు లో రాజమౌళి చెప్పినప్పటినుంచి ఆ నవంబర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మహేష్ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చున్నారు. నవంబర్ వచ్చేస్తుంది. ఆ SSMB 29 అప్ డేట్ ఎప్పుడొస్తుంది. హాలీవుడ్ స్టార్ జేమ్స్ కామెరూన్ చేతులా మీదుగా రాజమౌళి-మహేష్ మూవీ అప్ డేట్ వదుల్తారనే ప్రచారం ఎప్పుడు నిజమవుతుంది అనే ఆతృతలో ఫ్యాన్స్ ఉన్నారు. 

SSMB29 బిగ్ అప్‌డేట్‌కి రంగం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 16న రాజమౌళి-మహేష్ మూవీ టైటిల్‌ మరియు ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. దానికోసం ప్రత్యేకంగా హాలీవుడ్‌ స్థాయిలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే విషయం మహేష్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 

ఈ ఈవెంట్ కి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ గెస్ట్ గా వస్తారని.. రాజమౌళి సహా సూపర్ స్టార్ మహేష్, అలాగే కీలక పాత్రల్లో కనిపించనున్న ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ మిగతా యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారని తెలుస్తుంది. 

Mahesh fans, get ready now:

Rajamouli–Mahesh Babu big reveal on THIS date

Tags:   RAJAMOULI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ