బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటివారం నుంచి రీతూ-డిమోన్ పవన్ ల నడుమ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. వారు అలా అయితే హైలెట్ అవుతామని అనుకున్నారో, లేదంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో తెలియదు కానీ మొదట మూడు వారాలు రీతూ-పవన్ నడుమ బాగానే ఉన్నా.. తర్వాత ఓ టాస్క్ వల్ల రీతూ ని పవన్ పక్కన పెట్టేసాడు. దూరం బాగా పెరిగింది.
ఫైర్ స్ట్రోమ్ అంటూ వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చాక పవన్, రీతూ విషయంలో ఏం జరుగుతుందో, బయట వారి ట్రాక్ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది పవన్ కి చెబుతూ వస్తున్నారు. పవన్ వేరే వాళ్లతో క్లోజ్ గా ఉంటె రీతూ ఫీలైపోతుంది. అందులో నా తప్పు లేదు అంటూ రీతూ కి సర్ది చెబుతున్నా పవన్ ని రమ్య మోక్ష నువ్వు రీతూ ని లవ్ చేస్తున్నావా అంటే ఛీ అదేమీ లేదు అన్నాడు డిమాన్ పవన్. నేను బయట చూసాను నువ్వు ఏడ్చావు, అందరూ రీతూ తో నువ్వు లవ్ ఉన్నావని అనుకున్నారు అంటూ చెప్పడం.
ఆతర్వాత అయేషా కూడా పవన్ ని రీతూ గురించి అడిగింది. అసలు ప్రేమ లాంటిది ఏమి లేదు మాది ఫ్రెండ్ షిప్, తనతో కంఫర్ట్ గా ఉంటాను అంటూ.. అది ట్రాక్ కోసమే అన్నట్టుగా పవన్ రీతూ విషయంలో చెప్పడం చూసి పవన్ దగ్గర రీతూ కి ప్రేమ లేదు దోమా లేదు అంటున్నారు నెటిజెన్స్. మరోపక్క వైల్డ్ కార్డు ఎంట్రీ సాయి తనూజ దగ్గరకు వచ్చి రీతూ కి పవన్ కి మధ్యన ప్రేమ ఉందా అని తనూజ తో మాట్లాడాడు. కిచెన్ లో రీతూ కి పవన్ కి ప్యాచప్ చేసేలా తనూజ ప్లాన్ చేసింది.
వాష్ రూమ్ దగ్గర నాగురించి మాధురి గారు నీకు ఏదో చెప్పారు నువ్వేమన్నావ్ అంటూ రీతూ అడిగింది పవన్ ని. నేనేమి అనలేదు అన్నాడు. దానితో రీతూ వచ్చి పవన్ ని హగ్ చేసుకుంది. కానీ పవన్ మాత్రం బిగ్ బాస్ కోసమే ప్లే చేస్తున్నాడు. అది రీతుకి అర్ధం కావడం లేదు అనేది ఆమె ఫ్యాన్స్ బాధ.