ఓటీటీ ప్రపంచంలో సక్సెస్ ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన వెబ్ సీరీస్ దిల్లీ క్రైమ్స్. ఇప్పుడు ఈ వెబ్ సీరిస్ సీజన్ 3 ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. తాజాగా దిల్లీ క్రైమ్స్ టీజర్ వదలడమే కాదు స్ట్రీమింగ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ వేదికగా దిల్లీ క్రైమ్స్ రకరకాల సస్పెన్స్ థ్రిల్లింగ్ కేసులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దిల్లీ క్రైమ్స్ సీజన్ 1, సీజన్ 2 ని వేరే వేరే కేసులతో డిజైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న మేకర్స్ సీజన్ 3 ని వాటికి తగ్గకుండా డిజైన్ చెయ్యడమే కాదు.. హ్యూమా ఖురేషి లాంటి క్రేజీ నటులను ఇందులో భాగం చెయ్యడం ఈ సీజన్ పై అంచనాలు పెంచేలా చేసింది.
దిల్లీ క్రైమ్స్ సీజన్ 3 ని నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ టీజర్ తో పాటు గా అనౌన్స్ చేసింది.