బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ ని వదలకుండా అంతే వేగంగా పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నారు. అలియా భట్, దీపికా పదుకొనె, కియారా అద్వానీ ప్రేమించిన హీరోలు రణబీర్ సింగ్, రణ్వీర్ సింగ్, సిద్దార్థ్ మల్హోత్రాలను వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అంతేకాదు ఈ ముగ్గురు టాప్ హీరోయిన్స్ పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చారు కూడా.
ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కత్రినా కైఫ్ చేరింది. హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి సీక్రెట్ గానే వివాహం చేసుకున్న కత్రినా కైఫ్.. తన ప్రెగ్నెన్సీని సైతం దాచిపెట్టింది. బేబీ బంప్ ఫోటో షూట్ లీకవడంతో విక్కీ కౌశల్ జంట కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసారు. అయితే కత్రినా కైఫ్ ఆడపిల్లకు జన్మనిస్తుందా, లేదంటే అబ్బాయికి జన్మనిస్తుందా అనేది అభిమానుల్లో చాలా క్యూరియాసిటీ వుంది.
ఇక కత్రినా కైఫ్ కి ఆడపిల్లే పుడుతుంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్స్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అలియా, దీపికా, కియారా వీళ్ళందరికి ముందుగా ఆడపిల్లలే పుట్టారు. ఇప్పుడు కత్రినా కూడా ఆడపిల్లకు జన్మనిచ్చి వాళ్ళ సరసన చేరబోతోంది అంటూ జ్యోతిష్యం చెబుతున్నారు జాతకనిపుణులు. చూద్దాం కత్రినా కి ఎవరు పుడతారా అనేది.