Advertisementt

OG ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Tue 14th Oct 2025 08:54 AM
pawan kalyan  OG ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
OG OTT Arrival Date Locked OG ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 25 న భారీ అంచనాలా నడుమ విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల పవన్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేసింది. ఫ్యాన్స్ కి ఎలా కావాలో, ఏం కావాలో దర్శకుడు సుజిత్ అదే చూపించాడు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. 

థియేటర్స్ లో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిన OG చిత్రం కొన్ని చోట్ల బయ్యర్లకు స్వల్ప నష్టాలను మిగిల్చింది. OG కి వచ్చిన టాక్ కి కలెక్షన్స్ కి పొంతనే లేదు. ఇకపోతే సెప్టెంబర్ 25 న విడుదలైన ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అందరి కన్ను పడింది. OG చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో సొంతం చేసుకుంది. 

ఈ చిత్రాన్ని ఈ నెల 23 నుంచి అంటే వచ్చే గురువారం నుంచి OG ని నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. 

OG OTT Arrival Date Locked:

Pawan Kalyan They Call Him OG to Premiere on Netflix

Tags:   PAWAN KALYAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ