బిగ్ బాస్ సీజన్ 9లో ఆదివారం ఐదో వారానికి ఆరుగురు వైల్డ్ కార్డు లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అందులో ముందుగా అలేఖ్య చిట్టి పికిల్ రమ్య హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే దివ్య ని, భరణి ని, రాము రాథోడ్ ని టార్గెట్ చేసింది. తనకు హౌస్ లో ఎవరూ నచ్చలేదు అన్న రమ్య భరణి బంధాల ముసుగులో ఉన్నారు అంది.
తర్వాత సెలెబ్రిటీ కోటాలో నటుడు సాయి అడుగుపెట్టాడు. ఆ నెక్స్ట్ దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి దివ్వెల మాధురి జంట సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ అయ్యిందో అందరూ చూసారు. తనపై ఉన్న నెగిటివిటీని పోగొట్టుకునేందుకు తను హౌస్ లోకి వచ్చాను అంది. దువ్వాడ శ్రీనివాస్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అంటూ మాధురి చెప్పుకొచ్చింది. ఆతర్వాత నిఖిల్ నాయర్, ఆయేషా, గౌరవ్ గుప్తా లు ఈ సీజన్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.
మరి ఈ వారం నుంచి ఈ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చిన వాళ్లంతా ప్రస్తుతం హౌస్ లో బుల్లితెర అభిమానుల అండ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ తో పోటీ ఎలా పడతారో, ఆ పోటీ ఎలా ఉంటుందో అనేది చూడాలి.