పూరి జగన్నాథ్ కొన్నాళ్లుగా ఛార్మి తో కలిసి బిజినెస్ చేస్తున్నారు. హీరోయిన్ గా డిమాండ్ తగ్గాక ఛార్మి పూరి పంచన చేరి సినిమాలు నిర్మిస్తూ బిజీ అయ్యింది. ఎప్పుడు పూరి పక్కనే ఉండడంతో ఛార్మి కి పూరికి మద్యన ఏదో రిలేషన్ ఉంది అంటూ తెగ ప్రచారం జరగడమే కాదు.. పూరి జగన్నాథ్ తో కలిసి ఉంటూ భార్య కు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్దపడ్డాడనే వార్తలు ఎన్నోసార్లు వినిపించాయి.
కొన్నాళ్లుగా వ్యాపారరంగంలో కోలుకోలేని దెబ్బలు తిన్న ఛార్మి, పూరి లు ప్రస్తుతం విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ ఛార్మి తో ఉన్న రిలేషన్ పై ఓపెన్ అయ్యారు. ఛార్మీ నాకు 13 ఏళ్ల వయసు నుండి తెలుసు. ఇప్పుడు కాదు గత 20 ఏళ్లుగా మా మధ్య స్నేహం కొనసాగుతోంది. మేమిద్దం కలిసి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పని చేసాం.
మా మధ్యన ఏదో సంబంధం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ మా మధ్య ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదని స్పష్టంగా చెప్పగలను. ఛార్మీకు ఇంకా పెళ్లి కాలేదు, అందుకే ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే ఛార్మి కి 50 ఏళ్ళు ఉంది ఉంటె.. సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యేవి కాదు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, ఎప్పటికి అది శాశ్వతం అంటూ పూరి తాజాగా ఛార్మి తో బంధం పై ఓపెన్ అయ్యారు.