మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠి అయోధ్య అమ్మాయి. వరుణ్ తేజ్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని మెగా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. ఈమధ్యనే వరుణ్ తేజ్-లావణ్య ల జంటకు అబ్బాయి పుట్టాడు. నాగబాబు, చిరు లు మెగా వారసుడు ని ఎత్తుకుని మురిసిపోయారు.
ఈరోజు కర్వా చౌత్. అంటే నార్త్ ఇండియన్స్ చేసుకునే పండుగ. పెళ్లి అయిన అమ్మాయిలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి జల్లెడలో చంద్రుణ్ణి చూసి ఆతర్వాత భర్తను చూసి భర్త చేతి నుంచి మంచి నీళ్లు తాగి వ్రతం విరమిస్తారు. రకుల్ ప్రీత్ దగ్గర నుంచి నార్త్ హీరోయిన్స్ అంతా అలాగే ఈ కర్వా చౌత్ చేసారు.
అలాగే నార్త్ అమ్మాయి అయిన లావణ్య త్రిపాఠి కూడా తన భర్త వరుణ్ తేజ్ తో మెహిందీ అంటే గోరింటాకు పెట్టించుకుని మరీ కర్వా చౌత్ పూజ చేసుకుని భర్త వరుణ్ మొహాన్ని జల్లెడలో చూసి వ్రతాన్ని విరమించినట్లుగా ఫొటోస్ ను షేర్ చేసింది.