సెప్టెంబర్ 25 న విడుదలైన పవన్ కళ్యాణ్ OG క్రేజీగా థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకుంది.. వారం తిరగకముందే రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 తో OG కి బిగ్ షాక్ తగిలింది. కాంతార కి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే OG కి రెండో వారం వరకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇప్పుడు మూడో వారం లోను OG కి రెండో వారంలో కాంతార కు బాగానే కలిసొస్తుంది.
కారణం నిన్న విడుదలైన అరి, శశివదనే, మటన్ సూప్, కానిస్టేబుల్ చిత్రాలేవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. చిన్న సినిమాలే అయినా కంటెంట్ బావుంటే హిట్ అవడం పక్కా. ఈ మధ్యనే లిటిల్ హార్ట్స్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్స్ లో బిగ్ హిట్ అయ్యింది. అలా ఈ వారం చిన్న సినిమాలు విడుదలైనా అవేమి ప్రేక్షకులకు ఎక్కలేదు.
అందుకే ఈ వారం కూడా అంటే దీపావళి సినిమాలు తెలుసు కదా, K -ర్యాంప్, డ్యూడ్ చిత్రాలు వచ్చేవరకు OG, కాంతారా చిత్రాలదే హవా, ప్రస్తుతం ఆడియన్స్ కు ఈ రెండు పెద్ద సినిమాలే దిక్కు. ఈ వీకెండ్ లో OG, కాంతారా థియేటర్స్ కళకళలాడడం ఖాయం.