కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది పరదా చిత్రం రిజల్ట్ తో డిజప్పాయింట్ అయ్యింది.. ఆతర్వాత వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి కిష్కిందపురి చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా బయ్యర్లు మాత్రం నష్టాలు లేకుండా బయటపడిపోయారు.
ప్రస్తుతం కిష్కిందపురి సక్సెస్ జోష్ లో ఉన్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కొన్నాళ్లుగా గ్లామర్ గా టర్న్ అయిన అనుపమ చిటిపొట్టి డ్రెస్సులతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న బ్యూటిఫుల్ లుక్ ని అనుపమ షేర్ చేసింది.
రెడ్ బనారసీ టాప్ లో లూజ్ హెయిర్ తో అనుపమ పరమేశ్వరన్ సింపుల్ గా కనిపించినా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.