బిగ్ బాస్ సీజన్ 9 లోకి వచ్చిన సంజన మొదట్లో నాటిగా దొంగతనాలు చేస్తూ కంటెంట్ ఇచ్చింది. కానీ నాగార్జున ఆమెకు దొంగలున్నారు బోర్డు ఇచ్చాక మళ్లీ దొంగతనం చెయ్యలేదు. మొదటి వారమే కెప్టెన్ గా చేసిన సంజన ఫ్లోరా షైనీ తో ఫ్రెండ్ షిప్ చేస్తూ ఆమెతో అన్ని పనులు చేయించుకుంటుంది. మాస్క్ మ్యాన్ హరిత హారిష్ సంజనను ఎనిమిగా చూసాడు. అయితే నామినేషన్స్ లో ఉండడంతో ఈ వారం అబ్బాయిలతో సమానంగా సంజన-ఫ్లోరా ల జోడి టాస్క్ ఆడింది.
భరణి-దివ్య, పవన్-రీతూ జోడితో పోటాపోటీగా టాస్క్ ఆడిన సంజన-ఫ్లోరా లు ఈ వారం ఎక్కడ ఎలిమినేట్ అవుతారో అనే భయంతో టాస్క్ లు తెలివిగా ఆడుతున్నారు. అయితే పాయింట్స్ పట్టికలో టాప్ లో ఉన్న భరణి-దివ్య జోడిలను లేపి సుమన్-శ్రీజ, సంజన-ఫ్లోరా జోడీలు పాయింట్స్ పట్టిక లో చివర ఉన్నారు, వారిలో ఎవరిని తప్పిస్తారు అన్నారు.
దానికి భరణి.. సంజన వాళ్ళు మాకు కాంపిటేషన్ కావొచ్చు, అందుకే మేము సంజన-ఫ్లోరా జోడీని తీసేస్తున్నాం అన్నారు. దానితో సంజన ఎమోషనల్ అయ్యి, బిగ్ బాస్ మేము ఈ ఫిజికల్ టాస్క్ లు ఆడలేకపోతున్నాం నన్ను ఇంటికి పంపించెయ్యండి అంటూ ఏడుస్తున్న ప్రోమో వైరల్ గా మారింది.