కింగ్ నాగార్జున రీసెంట్ గానే తన 100 వ చిత్రాన్ని సైలెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే మొదలు పెట్టేసారు. ఈ చిత్రాన్ని ఇంత సింపుల్ గా మొదలు పెట్టడం పై అక్కినేని అభిమానులు కాస్త డిజప్పాయయింట్ అయినా.. ఎట్టకేలకు నాగార్జున #King 100 ని మొదలు పెట్టినందుకు హ్యాపీ గా ఉన్నారు.
ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున చేస్తున్నారు. బోలెడన్ని స్పెషల్స్ ఈ చిత్రంలో ఉంటాయని చెబుతుంటే.. ఇప్పుడు #King 100 లో క్రేజీ లేడీ ఎంటర్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. నిన్నే పెళ్లాడుతా లో నాగార్జున కు జోడిగా నటించిన బాలీవుడ్ హీరోయిన్ టబు కింగ్ 100 వ చిత్రంలో ఇన్నేళ్ల తర్వాత నాగ్ కి జోడిగా నటించబోతున్నట్లుగా టాక్.
నాగార్జున-టబు జోడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, నిన్నే పెళ్లాడుతా సినిమా ని ఇప్పటికి ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో తెలుసు. మరి నాగార్జున తన 100 ప్రాజెక్ట్ కి ప్రత్యేకంగా టబు ని తీసుకురావడం మాత్రం ఈప్రాజెక్టు పై అంచనాలు పెంచడానికే అని అర్ధమవుతుంది.
నాగ్ 100 మూవీ కి లాటరీ కింగ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు, ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ టైటిల్ క్లిక్ అయితే నాగార్జున 100 వ చిత్రానికి ఇదే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేస్తారని టాక్.