Advertisementt

ఫైనల్లీ ఓటీటీలోకి వార్ 2

Wed 08th Oct 2025 05:29 PM
war 2  ఫైనల్లీ ఓటీటీలోకి వార్ 2
War 2 OTT release date officially confirmed! ఫైనల్లీ ఓటీటీలోకి వార్ 2
Advertisement
Ads by CJ

ఆగష్టు 14 న స్పై యూనివర్స్ నుంచి వచ్చిన హృతిక్ రోషన్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల వార్ 2 చిత్రం పై ఉన్న భీభత్సమైన అంచనాలు అందుకోవడంలో ఆ చిత్రం దారుణంగా విఫలమైంది. నార్త్ లో అయినా వార్ 2 పెరఫార్మెన్స్ బావుంటుంది అనుకుంటే.. అక్కడ కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్ చతికిల పడింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబో సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేవనేసారు. 

వార్ 2 VFX పై అయితే దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఇక ఈసినిమా థియేటర్స్ లో అంతగా పెరఫామ్ చెయ్యకపోయినా.. ఓటీటీ రిలీజ్ మాత్రం బాగా లేట్ అవుతూ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వార్ 2 డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. 

ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న వార్ 2 ఓటీటీ రిలీజ్ పై ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. రేపు అంటే అక్టోబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా వార్ 2  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. 

War 2 OTT release date officially confirmed! :

War 2 OTT Release: Streming Begins Tonight

Tags:   WAR 2
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ