Advertisementt

పెద్ది - పూణేలో సాంగ్ షూట్

Wed 08th Oct 2025 06:35 PM
peddi  పెద్ది - పూణేలో సాంగ్ షూట్
Peddi Song Shoot From Tomorrow In Pune పెద్ది - పూణేలో సాంగ్ షూట్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రేపు పూణేలో ప్రారంభమయ్యే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ కోసం టీం సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ పై అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు. 

అకాడమీ అవార్డు విన్నర్ మాస్ట్రో AR రెహమాన్ అదిరిపోయే సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కి స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుంది. సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ కొనసాగుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ పాషన్ తో పనిచేస్తోంది.

రామ్ చరణ్ తన పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న పెద్ది గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Peddi Song Shoot From Tomorrow In Pune:

Peddi Spectacular Song Shoot From Tomorrow In Pune

Tags:   PEDDI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ